ఆయిల్ పామ్ సాగుతో భవిషత్తు

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా ప్లాంటేషన్ డ్రైవ్ ప్రోగ్రాములో భాగంగా జక్రాన్ పల్లి మండలం మునిపల్లి గ్రామమం ఆర్మూర్ మండలం లో గాజుల చిన్న రెడ్డి 6 ఎకరాలు లో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమం కీ ఉద్యన అధికారి సుమన్,ఆయిల్ పామ్ కంపెనీ జిల్లా ఇంచార్జి రోహిత్, ఆర్మూర్ మండలం ఆయిల్ పామ్ క్లస్టర్ ఆఫీసర్ రాకేష్, నెటఫిమ్ కంపెనీ సిబంది,రైతులు పాలుగోన్ని ఆయిల్ పామ్ సాగుపై అవగాహనా కలిపించారు పామ్ ఆయిల్ కీ ఉన్నా డిమాండ్ గురించి వివరించడం జరిగింది. ప్రపంచంలో అత్యధిక దిగుబడి ని ఇచ్చేయ్ నూనెయ్ గింజల పంటలో ఆయిల్ పామ్ పంట ఒకటి.భారత దేశం ముడి చామరు ( పెట్రోల్,డీజిల్ ) తర్వాత ఎక్కువగా పామ్ ఆయిల్ ( ఆయిల్ పామ్ చెట్ల నుండి వచ్చిన గెలల తో తీసిన ఆయిల్)ని దిగుమతి చేసుకుంటుందని తెలిపారు.వంట నూనె లో దీని వాటా 70% వరకు ఉంటుంది.గత 100 సవంత్సరాలు నుండి భారత దేశం తన వంట నూనె డిమాండ్ లో 80%వరకు దిగుమతి చేసుకుంటూనే ఉంది.ఇంత డిమాండ్ ఉన్నా పంట కాబట్టి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బంగారు పంట మీద ఎక్కువగా శ్రద్ధ చూపించి రైతులకి తొడ్పాటు గా మొక్కలు మరియు డ్రిప్ మీద సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.దీనికి తోడుగా రైతులకి ఎరువులు మరియు అంతర పంటకి పెట్టుబడి సాయం కింద ఒక ఎకరానికి 4200/- రూపాయిలు మొదటి 4 సవంత్సరాలు ఇవ్వడం జరుగతుందని తెలిపారు. ప్రేనిక్యూ కంపెనీ జిల్లా ఇంచార్జి మాట్లాడుతు ఆయిల్ పామ్ మార్కెటింగ్ గురించి వివరించారు భారతీయ వంట నూనెలా మిషన్ -ఆయిల్ పామ్ ని ఉద్యన శాఖ ద్వారా నిర్వహించ బడుతుంది.మన నిజామాబాద్ జిల్లా 2022 నుండి ప్రారంభం అయింది ఇప్పటి వరకు 1897 రైతులు మరియు 4637 ఎకరాలు ఆయిల్ పామ్ తోటలు సాగు లో ఉన్నాయి.
ఉద్యన శాఖ వారు తెలంగాణ రాష్ట్రము లో ఉన్న జిల్లాలను ఆయిల్ పామ్ జోన్ గా గుర్తించారు.దాంట్ల మన నిజామాబాద్ జిల్లా (Preunique India Private Limited) కంపెనీ కీ గవర్నమెంట్ వారు కేటాయించారు.వారు రైతులకి అందుబాటులో చేపూర్ గ్రామం లో నర్సరీ ఏర్పాటు చేసామని ఉద్యానవరా శాఖ అధికారి సుమన్ తెలిపారు ఆయిల్ పామ్ పంట కొనుగోలు గురంటీ ఉన్నా పంట ( ఆయిల్ పామ్ యాక్ట్ 1993)ద్వారా రైతులకి రక్షణ కలిపిస్తుంది.రైతులకి అందుబాటులో 10-20 కిలోమీటర్ దూరం లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల దెగర నుండి కంపెనీ వారు నేరుగా కొని డబ్బులు అకౌంట్ లో చెలిస్తారని తెలిపారు. ఆయిల్ పామ్ డిర్ఘకలికంగా సాగు చెసేయ్ పంట ఎకరానికి 50 మొక్కలు అవసరం పడ్తాయి.మొక్కకి మొక్కకి మధ్య దూరం 9 మీటర్లు మధ్య లో ఉన్నా కాలి స్థలం లో మొదటి మూడు సవంత్సరాలు అంతర పంటలగ పసుపు,సొయా,మొక్క జొన్న్,జొన్న,కూరగాయలు,వేరుశనగ,మినుములు,అరిటి బొప్పాయా,జమ్మ,పత్తి సాగు చేసుకొని లాభం పొందా వచ్చును ఆయిల్ పామ్ 4 వ సవంత్సరామ్ నుండి కోకో చాక్లెట్ పంట సాగు చేసుకోవచ్చు ఆయిల్ పామ్ తోటలో 4 వ సంవత్సరం నుండి ఒక ఎకరానికి 175-200 మొక్కలు పెట్టుకొని మంచి ఆదాయని పొందవచ్చుని తెలిపారు. ఆయిల్ పామ్ యాక్ట్ 1993 ద్వారా సాగు చేస్తున్న పంట కాబట్టి కంపెనీ వరకు నిర్ణయించిన జిల్లాలు ( నిర్మల్,నిజామాబాద్,ఆదిలాబాద్,సిరిసిల్ల,మహబూబ్నగర్ నాగర్కర్నూల్,వనపర్తి ) లో కలెక్షన్ కేంద్రాల ద్వారా గెలలను కొనుగోలు చేయాలి.మన తెలంగాణ రాష్ట్రము లో 2020 లో ఉద్యన శాఖ వారు మహబూబ్నగర్,నాగర్కర్నూల్ మరియు వనపర్తి జిల్లా జిల్లా పైలట్ ఆయిల్ పామ్ తోటలని నటించడం జరిగిందని తెలిపారు.వాటికీ వచ్చిన గెలలను ప్రేనిక్యూ కంపెనీ వారు కలెక్షన్ సెంటర్ ద్వారా రైతుల దెగర నుండి కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్నియించ ధర మే 2024 గాను 14229/- ఒక టాన్ను కీ రైతులకి చెలించాల్సి ఉంటుందని అన్నారు.ఇప్పటి వరకు సుమారు 289 టాన్నులు కొనుగులు చేసి రైతులకి 4-7 రోజులో బ్యాంకు అకౌంట్ లో జమ చేసారు.కాబట్టి మన నిజామాబాద్,నిర్మల్,సిరిసిలా మరియు ఆదిలాబాద్ ( కంపెనీ వారికీ ఆలౌట్ చేసిన జిల్లాలో ) ఇది విధముగా రైతులకి అందుబాటులో కలెక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసి కొనడం జరుగుతుందని తెలిపారు.రైతు సోదరులు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా ఈ పంట ని పెద్ద ఎత్తున సాగు చేసి లాభలు గాడించండని తెలిపారు. 2024-25 గాను ఆయిల్ పామ్ సాగు కోరుకుంటూ దార్కస్థులు స్వికరిచడం మొదలు పెట్టాము.రైతులు మీ సమీపంలో లో ఉన్నా ఉద్యన అధికారి గాని లేదా కంపెనీ క్లస్టర్ ఆఫీసర్ ని సంప్రదించగ్లారని తెలిపారు.