విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలి

– దేవాన్ష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు ప్లేట్ల పంపిణీ
– ఫౌండేషన్ సేవలు అభినందనీయం: బుడిగే పెంటయ్య గౌడ్
–  విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి : జూకంటి ప్రవీణ్ కుమార్
– పేద విద్యార్థులకు తోడ్పాటు అందించడం గొప్ప విషయం: ఇంజ మహేష్
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుడిగే పెంటయ్య గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్, ఎంఈఎఫ్ జిల్లా ఇంచార్జ్ ఇంజ మహేష్  పేర్కొన్నారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం సాదువెళ్లి ప్రాథమిక పాఠశాలలో దేవాన్ష్ ఫౌండేషన్ చైర్మన్ మీస మల్లయ్య, శశికళ ఆధ్వర్యంలో, విద్యార్థులకు భోజనం ప్లేట్లు, నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు భోజన  ప్లేట్లు, నోటు పుస్తకాలు, పెన్నులు అందించడం, తదితర సేవా కార్యక్రమాలు చేపడుతున్న దేవాన్ష్ ఫౌండేషన్ ను వారిని అభినందించారు. దేవాన్ష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలకు తాము ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఫౌండేషన్ సభ్యులను  శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాన్ష్  కుటుంబ సభ్యులు మీస వెంకటేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డమీద పాండురంగం, అధ్యాపకులు సోమయ్య, నాయకులు డొంకెన  బాలరాజు గౌడ్, సుంకే ప్రసాద్, డొంకెన గణేష్ గౌడ్, కొంగరి నరహరి, బింగి శివానంద్, కటకం జ్ఞానేశ్వర్, గుజ్జుక  శ్రీనివాస్, పుట్ట సాయినాథ్, విద్యార్థులు పాల్గొన్నారు.