ధనసరి సూర్య జన్మదిన  సందర్భంగా రక్తదాన శివరం ఏర్పాటు

– యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలి
నవతెలంగాణ  – ములుగు
ఈ నెల జులై 26 రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ధనసరి సూర్య పుట్టిన రోజు సందర్భంగా  ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ములుగు లో తలా సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పిల్లల కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన కాంగ్రెస్ నేతలు ఆకుతోట అన్వేష్, నేపాల్ రావు, కుక్కల నాగరాజు, మధులు తెలిపారు. బుధవారం వారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరానికి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చునని, ఇట్టి రక్తదాన శిబిరంలో ములుగు జిల్లాలోని చుట్టుపక్కల గ్రామాల యువత అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ రక్తదాన శిబిరం ఉదయం 8:30 గంటల నుండి 4:00 గంటల వరకు కొనసాగుతుందని అన్నారు.