రజక సంఘం ఆధ్వర్యంలో బోనాలు…

నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం పోచమ్మ,ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. డప్పుప్పుళ్లతో మహిళలు బోనాలతో ఊరేగింపు చేపట్టి ఆలయాల వద్ద బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.రజక కుల సంఘ నాయకులు పాల్గొన్నారు.