ఆది జ్వాల..అనంత జ్వాల.. వైర జ్వాల

Adi Jwala..Ananta Jwala.. Vira Jwalaహీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువ’. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు ఈ సినిమా వస్తోంది. మంగళవారం సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ‘ఫైర్‌ సాంగ్‌’ రిలీజ్‌ చేశారు. ఈ పాటలో యుద్ధ వీరుడిగా సూర్య మేకోవర్‌, ఫెరోషియస్‌ లుక్స్‌ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ ‘ఫైర్‌సాంగ్‌’కు ఫైర్‌ ఉన్న పవర్‌ఫుల్‌ ట్యూన్‌ కంపోజ్‌ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్‌ అందించగా, అనురాగ్‌ కులకర్ణి ఎనర్జిటిక్‌గా పాడారు. ‘ఆది జ్వాల..అనంత జ్వాల..వైర జ్వాల.. వీర జ్వాల..దైవ జ్వాల..దావాగ్ని జ్వాల..’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ సినిమాకి ఈపాట స్పెషల్‌ అట్రాక్షన్‌ కానుంది. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హ్యూజ్‌ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషర్స్‌ తెలుగులో గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ జోనర్‌లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోందీ సినిమా. పది భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్రీడీలోనూ ప్రేక్షకులను అలరించనుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను భారీగా రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.