పాలు పొంగిపోతున్నాయా?

Is the milk overflowing?స్టౌదగ్గర ఉన్నంతసేపు ఎలాంటి చలనం లేకుండా ఉండే పాలు.. అలా ఒక్కనిమిషం పక్కకు తిరగగానే పొంగిపోతుంటాయి.
రోజూ కాకపోయినా వారానికి రెండు, మూడుసార్లు తప్పనిసరిగా ప్రతీ ఇంట్లోనూ ఈ పొంగుడు కార్యక్రమం మామూలే. అవి పొంగడం, ఆ తరువాత స్టౌ శుభ్రం చేసుకోవడం..ఇదంతా పెద్ద తలనొప్పి. పాలు ఒక చుక్కకూడా కింద పడకుండా కాగబెట్టడం ఎలా..? అంటే దానికి కొన్ని టిప్స్‌ ఉన్నాయి.
పాలు కాగబెట్టే ఆ గిన్నెలో ఓ గరిటె పెట్టండి. దీనివల్ల పాలు కాగినప్పుడు అందులోని ఆవిరి బైటికి పోవడానికి దారి ఏర్పడడం వల్ల పొంగకుండా ఉంటాయి.
పాల గిన్నె అంచులకు నెయ్యి రాయడం వల్ల పొంగకుండా చూడొచ్చు. నెయ్యిలోని గ్రీజ్‌ లాంటి స్వభావం పాలను పొంగనివ్వదు.
పాల గిన్నె మీద అడ్డంగా చెక్క స్పూన్‌ను ఉంచితే కూడా పాలు పొంగవు. అయితే ఈ స్పూన్‌ పాలగిన్నె రెండు అంచులను దాటేలా ఉండేలా చూసుకోవాలి.