కోరిక తీర్చలేదని మహిళ గొంతు పిసికి హత్య

కోరిక తీర్చలేదని మహిళ గొంతు పిసికి హత్యనవతెలంగాణ-కాసిపేట
మండలంలోని లంబాడితండాలో తన కోరిక తీర్చమంటే ప్రతిఘటించిన మహిళను అంబారావు అనే వ్యక్తి గొంతు పిసికి హత్య చేసినట్లు దేవాపూర్‌ ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. దేవాపూర్‌ ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీర నీల(44) అనే మహిళ కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తన మొదటి భర్త పెళ్లైన ఒక సంవత్సరానికే చనిపోయాడు. రెండో భర్త 15 సంవత్సరాల క్రితం చనిపోగా పల్లంగూడకు చెందిన గాండ్ల రవితో సహజీవనం చేస్తూ ఇద్దరు లంబాడితండాలో ఉంటున్నారు. గాండ్ల రవి స్నేహితుడు కుడిమెత అంబారావు అప్పుడప్పుడు రవి లేని సమయంలో ఇంటికి వెళ్లి మృతురాల్ని తనతో సహజీవనం చేయాలని బెదిరించేవాడు. బుధవారం మధ్యాహ్నం పల్లంగూడకు చెందిన అంబారావు మృతురాలు నీలా దగ్గరికి వెళ్లి తన కోరిక తీర్చమంటే ప్రతిఘటించడంతో గొంతు పిసికి హత్య చేశాడు. ఈ మేరకు మృతిరాలి అన్న ఆజ్మీర దేవి సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి పరిశీలించారు.