బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్‌ బైక్‌

Electric bike from BMW– ధర రూ.14.90 లక్షలు
న్యూఢిల్లీ: లగ్జరీ బైకుల తయారీ కంపెనీ బిఎండబ్ల్యు మోటారోడ్‌ ఇండియా భారత మార్కెట్లోకి తన కొత్త బిఎండబ్ల్యు సిఇ విద్యుత్‌ బైకును విడుదల చేసింది. దీని ధరను రూ.14.90 లక్షలుగా నిర్ణయించింది. 8.5 కిలోవాట్‌ బ్యాటరీ ప్యాక్‌ కలిగి ఉంటుంది. ఇది ఒక ఫుల్‌ చార్జితో 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని ఆ కంపెనీ తెలిపింది. 6.9 కిలోవాట్‌ చార్జర్‌ ద్వారా గంట 40 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జ్‌ అవుతుందని తెలిపింది. ఇది 2.6 సెకన్లలో 0 నుంచి 50 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకుంటుందని.. గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్లు ప్రయాణించగలదని పేర్కొంది.