– ఎల్విపీిఈఐ సైంటిస్ట్ సామాజిక ఆరోగ్య పరిశోధకులు డాక్టర్ శ్రీనివాస్ మర్మముల
నవతెలంగాణ-బంజారాహిల్స్
వద్ధాశ్రమాలలో ఉంటున్న 60 ఏండ్లు పైబడినవారిలో మేధో సామర్ధ్యాల వైకల్యంతో పాటు దృష్టి వైకల్యం మధ్య గాఢమైన సంబంధాన్ని గుర్తించిన ఎల్విపీఈఐ పరిశోధనా బృందం నలుగురిలో ఒకరికి మేధా క్షీణత ఉన్నదనీ దృష్టిలోపం ఉన్నవారికి మతిభ్రమణం వచ్చే అవకాశాలు 4 రేట్ల ఎక్కువగా ఉన్నాయని దానికి సంబంధించిన పేపరు హైదరాబాద్ ఆక్యులర్ మోర్బిడిటీ ఇన్ ది ఎల్డర్లీ స్టడీ (హౌమ్స్)లో భాగంగా ఉంటుందని ఎల్విపిఈఐ సైంటిస్ట్ సామాజిక ఆరోగ్య పరిశోధకులు డాక్టర్ శ్రీనివాస్ మర్మముల తెలిపారు. బుధవారం ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్విపీఈఐ) లోని సామాజిక ఆరోగ్య నిపు ణులు వారి అంతర్జాతీయ సహకారులతో కలిసి బీఎంజె ఓపెన్ యాక్సెస్ అనే శాస్త్రీయ పత్రికలో ప్రచురించిన ఒక కొత్త పేపర్ దృష్ట్టి లోపం ఉన్న వృద్ధులలో మేధో సామర్ధ్యాల వైకల్యం అధిక ప్రాబల్యాన్ని వెల్లడిస్తున్నదన్నారు. దాని కోసం వద్ధులలో నలుగురిలో ఒకరు మేధో సామర్ధ్యాల వైకల్యంతో జీవిస్తున్నారని పేపర్ కనుగొన్నదన్నారు. నిజా నికి దృష్టిలోపం లేనివారితో పోలిస్తే దృష్టిలోపం ఉన్నవారికి మేధో సామర్ధ్యాల వైకల్యం ఉండే అవకాశం 4 రేట్లు ఉన్నద న్నారు. మరింత దృష్టిలోపంఉన్న వద్ధులు మేధో సామర్ధ్యాల వైకల్యానికి గురయ్యే అవకాశం ఉందని పేపర్ కనుగొన్నట్టు సమీప దృష్టి వైకల్యం (అంటే కళ్లద్దాలు లేకుండా ఫోన్ లేదా పుస్తకాలు చదవలేని స్థితి) కూడా మేధో సామర్ధ్యాల వైకల్యంతో సంబంధం కలిగి ఉన్నట్లు ఇది ప్రతి నలుగురు వ్యక్తులలో ఒకరిని సమీప దృష్టి వైకల్యంతో ప్రభావితం చేస్తున్నదని వివరించారు. తేలిక పాటి దృష్టి లోపం ఉన్న వద్ధులలో 30 శాతం కంటే తక్కువమందికి మేధో సామ ర్ధ్యాల వైకల్యం ఉండగా, దృష్టి వైకల్యం మరింత దిగజారు తున్న కొద్దీ ఈ శాతం క్రమంగా పెరుగుతుందన్నారు. అధ్యయనంలో అంధత్వం ఉన్నవారు 15 మంది ఉన్నారనీ అందులో 60 శాతం కొలవగల మేధో సామర్ధ్యాల క్షీణతను అదేవిధంగా,వయసుతో పాటు మానసిక క్షీణతకూడా పెరిగిందని తెలిపారు. పురుషులకంటే మేధో సామర్ధ్యాల వైకల్యం మహిళలకు 2 రేట్లు ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం కనుగొన్నట్టుచ మేధో సామర్ధ్యాల వైకల్యం తీవ్రరూపాలు మతిభ్రమణానికి (డిమెన్షియా) దారితీస్తా యని తెలిపారు. భారతదేశ వద్ధ జనాభాలో అత్యధికంగా మతిభ్రమణం ఇతర రకాల మేధా క్షీణతను అరికట్టడంలో దష్టిలోపాన్ని పరిష్కరించడం కీలకం కావచ్చని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని చెప్పారు.
వెల్కం ట్రస్ట్/డిబి ఇండియా అలయన్స్ ద్వారా నిధులు సమకూర్చిన డా శ్రీనివాస్ మర్మముల నేతత్వంలో చేసిన హైదరాబాద్ ఆక్యులర్ మోర్బిడిటీ ఇన్ ది ఎల్డర్లీ స్టడీ (హౌమ్స్) లో భాగంగా ప్రచురితమైన 16 పేపర్లలో ఈ పేపర్ ఒక భాగం అన్నారు.హైదరాబాద్‌లోని వృద్ధాశ్రమాల లో నివసిస్తున్న 1,500 మందికి పైగా వద్ధులు ఈ సముదాయంలో సుమారు 965 మందినీ ఈ పేపరులో చేర్చారు. వారిలో 60 శాతానికి కొద్దిగా ఎక్కువమంది స్త్రీలు. పాల్గొన్నవారిలో దాదాపు 27% మందికి మేధో సామర్ధ్యాల వైకల్యం ఉన్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెం టల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్), బెంగళూరు సహ-రచయితలు డా సువర్ణ అల్లాడి,యూఎస్‌ఎ నుంచి డా డేవిడ్ బ్లూమ్,హార్వర్డ్ మెడికల్ స్కూల్ హార్వర్డ్ యూనివర్సిటీ డా డేవిడ్ ఫ్రీడ్‌మాన్, యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ డా”జొషువా ఎర్లిచ్ లు పాల్గొన్నారు.