– మంత్రి సీతక్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పదేండ్లు అధికారంలో ఉండి నిరుద్యోగ సమస్యను పట్టించుకోకుండా బీఆర్‌ఎస్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అడుగుతోందని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించబోతున్న తరుణంలో దాని కోసం బీఆర్‌ఎస్ పట్టుపట్టడం హాస్యాస్పందమన్నారు. బుధవారం అసెంబ్లీలో లాబీల్లో ఇష్టాగోష్టిగా మంత్రి మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయంలో అసెంబ్లీలో నిరసన తెలిపితే తమ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. పదేండ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజాస్వామ్యం కనిపిస్తోందన్నారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో ఉన్న చిక్కు ముడులను విప్పి ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు.