– ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జైపాల్ రెడ్డి
నవతెలంగాణ-రాజేంద్రనగర్
మున్సిపల్ కార్మికుల హక్కులను అధికారులు కాలరాసే సహించే ప్రసక్తే లేదని ఏఐటీయూసీ రంగా రెడ్డి జిల్లా కార్యదర్శి జైపాల్ రెడ్డి హెచ్చరించారు. రాజేం ద్రనగర్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయం ముందు ము న్సిపల్ కార్మికుల ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జైపాల్ రెడ్డి మాట్లాడుతూ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్నారని మున్సి పల్ సర్కిల్‌లో 5 డివిజన్లో ప్రజల ఆరోగ్యాల పట్ల నిరం తరం శ్రమిస్తున్న మున్సిపల్ సిబ్బందిని అడుగడు గున వివక్షతకు గురవుతున్నారని ఆవేదన చెందారు. పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల ఫేస్ స్కానర్ హాజరు పేరుతో కార్మికుల జీతాలకు కోతలు విధిస్తున్నారనీ విధులు నిర్వ హించిన కూడా టెక్నికల్ సమస్యలతో కార్మికుల జీతాలు కట్ అవుతున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు నాలుగు వీక్లీ సెలవులు ఇస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు పేస్ స్కా నర్ వచ్చిన తర్వాత నుండి ఒక వారంలో ఆరు రోజులు తప్పనిసరిగా విధులు నిర్వహిస్తేనే వీక్లీ సెలవు మున్సిపల్ అధికారులు ఇస్తామంటున్నారు. ఒకవేళ వారంలో ఏదో ఒక రోజు రాకపోతే వీక్లీ సెలవు కూడా ఆఫ్ సెంట్ కింద వేసి రెండు రోజుల వేతనాలు కట్ చేయడంపై అనేక పో రాటాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కుల చట్టా లను తుంగలో తొక్కుతున్నారని అన్నారు. పారిశుద్ధ్య కార్మి కులకు ఇవ్వవలసిన వేతనంతో కూడిన వారాంతపు సెల వులు గతంలో ఇచ్చినట్లు ఇవ్వకపోతే పోరాటాలు ఉధ తం చేస్తామని అన్నారు. కార్మికులకు ఫేస్ స్కానర్ హాజ రు రోజుకు మూడుసార్లు తీసుకుంటున్నారు.మిడిల్ హాజరు వల్ల కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం మాత్రమే హాజరు తీసుకోవాలని కార్మికులు చాలా దూరం నుండి ఉదయం విధులకు వస్తా రు కాబట్టి వారికి 15 నిమిషాలు ఉదయం లేటు వచ్చినా తిరిగి ఇంటికి పంపించకుండా విధుల్లోకి తీసుకోవా లన్నారు. కార్మికులు 60 సంవత్సరాలు వయస్సు అయి పోయినటువంటి స్థానంలో వారి వారసులను ఉద్యో గంలోకి తీసుకోవాలి. వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అమలు చేయాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికులను కూడా పెంచాలి. పనిముట్లు (చీపురు కట్టలు ) లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికా రు పనులు చేయించే శ్రద్ధ కార్మికుల సమస్యలపై కూడా అధికారులు పరిష్కరించే విధంగా ఉండాలన్నారు. ఈ కా ర్యక్రమంలో రాజేంద్రనగర్ మండల కార్యదర్శి పి ఆనంద్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్‌ఎఫ్‌ఏ లు అనిల్ ఎల్లప్ప చందు వినరు శ్రీకాంత్ జాషువా ఏ రాజు జి సాయిలు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.