పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు– రెప్పపాటులో గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు
– దేశంలో సగటున రోజుకు 50 శాతం రోడ్డు ప్రమాదాలు
– ర్రాష్ట్ర పభుత్వం, రవాణాశాఖ, ట్రాఫిక్‌ పోలీసులు నియంత్రణపై దృష్టి సాధించాలి
నవతెలంగాణ-కందుకూరు
దేశంలో ప్రతి సంవత్సరమూ రోడ్డు ప్రమాదం వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువైపోతుంది. 20 24 సంవత్సరం నాటికి 50శాతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువై పోతున్నాయి. ప్రాంతం, వాహనం, సమయంతో సంబం ధం లేకుండా, పగలు, రాత్రి, వేకువజామున, ఎప్పుడు పడితే అప్పుడే ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో సగటు రోజుకు 50 శాతం ప్రమాదాలు, 20 శాతం మర ణాలు సంభవిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అంద జేసింది. రోడ్డు ప్రమాదాల్లో కుటుంబాలు చిన్నాభిన్నమై పోతున్నాయి. అయినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ప్రమాదం ‘మనకెందుకు జరుగుతుంది’ అని అను కుంటున్నారు తప్ప తమపై ఆధారపడ్డ కుటుంభం కోసం ఆలోచించడం లేదు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవ ట్లేదు. కుటుంబాలపై ఆధారపడిన వారు, నిమిషాల పరిధిలోని రోడ్డు ప్రమాదంలో మరణించడం, వారి కుటుం బాలు రోడ్డున పడుతున్నాయి. బయటికి వెళ్తున్న వ్యక్తి, క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడా లేదా అనే నమ్మకం సన్న గిల్లుతుంది. ఈ ప్రమాదాలను అదుపు చేసే పరిస్థితి రాష్ట్రంలో కనబడటం లేదని ప్రజలు అంటున్నారు. రోడ ్లపై తిరిగే వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగి పోవ డం, వేగ నియంత్రణనా చర్యలు చేపట్టకపోవడం, వంటి కార ణాలతో రోడ్డు ప్రమాదాల జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధన ఉల్లంఘన, అతివే గం 71 శాతం, రాంగ్‌ సైడ్స్‌ డ్రైవింగ్‌ 6.4 శాతం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రతి సంవత్సరం 10వేలకు పైబడి ప్రమాదాల జరుగుతున్నట్లు ప్రభుత్వ నివేదిక అం దజేసింది. ఈ ప్రమాదాలకు ధ్వంసమైన రోడ్లు, ఇరు కైన రోడ్లు, కార్లు, బైకులు ఎదురెదురు ఢకొీనడం జరుగుతుం ది, బస్సులో ఆటోలు ప్రస్తుతం ఏవీ సురక్షితం అన్నట్టు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం, ర వాణా శాఖ, ట్రాఫిక్‌ పోలీసులు నియం త్రణపై దృష్టి సాధిం చాలని ప్రజలు కోరు కుంటున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు తగుచర్యలు తీసుకుంటున్నాం
మండలంలో 2024 జనవరి నుండి జులై నెల 15 తారీకు వరకు రోడ్డు ప్రమా దాల లెక్కల ప్రకారం 12 మృతి చెందాగా 9మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ రో డ్డు ప్రమాదాలకు అతివేగం, మానవ తప్పిదాలు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, మద్యం మత్తు, రాంగ్‌, ఓవర్‌టాక్‌, వాహనాలకు సిగల్‌ సరిగా వేయకపోవడం, సూచిక బోర్డులో ఉ న్న పట్టించుకోకపోవడం, మూలమలుపులు, బ్రిడ్జిలపైన, వాహనాలు ఓవర్‌ టాక్‌ చే యడం ప్రమాదాలకు కారణమవుతుంది. బైకు నడిపేవారు హెల్మెట్‌ పెట్టు కోక పో వడం వల్ల తలకు తీవ్ర గాయాలయ్యాయి చనిపోతున్నారు. కారులను నడిపేవారు, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వలన ప్రమాదం జరిగిన సమయంలో వారు కూడా మృతి చెందుతున్నారు. ప్రమాదాలు జరగకుండా వాహనాదారులు, ఆటోలు, బైకులు, లారీ లు, డీసీఎం వ్యాన్‌ డ్రైవర్లు, కారులు, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సమయం సమయ పాలన పాటించాలి. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలి. మూలమాలపుల వద్ద వాహనం మరొక వాహనాన్ని ఓవర్‌ టాక్‌ చేయకూడదు. ఎదురెదురుగా వస్తున్న వాహనాలను అధిగమించడానికి కొం త సమయం చూపాలి. రోడ్డు ప్రమాద వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ప్రతి ఒక్కరు రాంగ్‌ రూట్లో పోకుండా, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించి, రోడ్డును సమయాన్ని బట్టి ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడిపించాలి.
సీతారాం, సీఐ కందుకూరు