అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యం పట్టుకున్న పోలీసులు

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యం పట్టుకున్న పోలీసులు– అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు ఎస్‌ఐ పరశురాం
నవతెలంగాణ-మిరుదొడ్డి
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామం వద్ద డీసీఎం వాహనంలో బియ్యాన్ని తరలిస్తుండగా, అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి నుంచి దౌల్తాబాద్‌ మండలం వడ్డేపల్లి గ్రామానికి పీడీఎస్‌ బియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు పట్టుకున్న బియ్యాన్ని సివిల్‌ సప్లై అధికారులకు తెలియజేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు బియ్యాన్ని సివిల్‌ సప్లై గోదాంకు తరలించారు. సుమారు 150 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుబడినట్లు తెలుస్తుంది. సివిల్‌ సప్లై అధికారుల నివేదిక ఆధారంగా కేసు నమోదు చేశారని పోలీసులు వెల్లడించారు. ఎవరైనా అక్రమంగా బియ్యం తరిలిస్తే చట్టపరమైన చర్యలు తప్పు అని అన్నారు.