నిజాయితీగా విధులు నిర్వర్తించాలి

– పోలీస్‌ స్టేషన్‌ సందర్శనలో సీపీ అనురాధ
– రికార్డులను తనిఖీ చేసిన సీపీ
– గంజాయి, బెల్ట్‌ దుకాణాలపై చర్యలు చేపట్టాలని హెచ్చరిక
నవతెలంగాణ-బెజ్జంకి
ప్రజలకు సేవలందించడలో పారదర్శకంగా వ్యవహరిస్తూ నిజాయితీగా విధులు నిర్వర్తించాలని సీపీ డాక్టర్‌ అనురాధ పోలీసులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ను సీపీ అనురాధ అకస్మికంగా సందర్శించి పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్‌ యందు సిబ్బంది విధులను తెలుసుకుని రికార్డులను తనిఖీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించకుండా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి సీపీ సూచించారు. మండలంలో గంజాయి, మత్తు పదార్థాలు, బెల్ట్‌ దుకాణాల్లో మద్యం అమ్మకాలను నివారించేల చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీసులకు సీపీ తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌ యందు ఫిర్యాదు చేయడానికి వచ్చిన ప్రతి ఫిర్యాదుదారుడికి తిరిగి రీసీప్ట్‌ అందించాలని సిబ్బందికి సూచించారు. అక్రమ ఇసుక రవాణపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ ముందు మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ మధు, సిద్దిపేట రూరల్‌ సీఐ శ్రీను, సీసీఆర్బీ సీఐ కమలాకర్‌, ఐటీ సెల్‌ ఎస్‌ఐ నరేందర్‌, ఎస్‌ఐ కష్ణారెడ్డి, ఏఎస్‌ఐ శంకర్‌ రావు, హెడ్‌ కానిస్టేబుళ్లు ఎల్లయ్య, కనకయ్య, అంజయ్య, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.