రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలి

The loan waiver money should be deposited in the farmers' accounts– కొత్త ఋణాలు మంజూరు చేయాలి
– జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి
వతెలంగాణ-కల్హేర్‌
ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ డబ్బులను రైతుల సేవింగ్‌ ఖాతాల్లో వెంటనే జమ చేయాలని సంగారెడ్డి కలెక్టర్‌ క్రాంతి వల్లూరు అన్నారు. మండల కేంద్రమైన కల్హే ర్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్‌ను బుధవారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రుణమాఫీ, రుణాల రెన్యు వల్‌ ప్రక్రియలను పరిశీలించారు. బ్యాంకు పరిధిలో మొత్తం ఎంతమంది రైతులకు రుణమాఫీ లబ్ధి పొందారు అనే వివరలను బ్యాంకు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. లక్ష లోపు రుణాలు ఉన్న 660 మంది రైతులకు ఋణమాఫీ వచ్చిం దని బ్యాంక్‌ మేనేజర్‌ జాదవ్‌ సంతోష్‌ కలెక్టర్‌కు తెలిపారు. ఇప్పటివరకు 120 మంది రైతుల బ్యాంకు సేవింగ్‌ ఖాతాల లో కోటి రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. మిగిలిన 440 మంది రైతుల ఋణమాఫీ డబ్బులు వారి సేవింగ్‌ ఖాతాల్లో జమ చేస్తున్నట్టు చెప్పారు. రుణాలు సైతం ఇస్తు న్నట్లు తెలిపారు. రైతులు 1బి తీసుకురాగానే వెంటనే షెడ్యూల్‌ చేసి రుణమాఫీ డబ్బు లు అందజేస్తున్నట్టు బ్యాం కు సిబ్బంది కలెక్టర్‌కు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ మాట్లా డుతూ.. వ్యవసాయ అధికారులు గ్రామసభలు ఏర్పాటు చేసి రైతులకు రుణమాఫీపై అవగాహన కల్పించాలని ఆదేశిoచారు. అనంతరం కల్హేర్‌ ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసారు. ఉపాధ్యాయుల విద్యార్థుల హాజరు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మూడో, నాలుగో తరగతి విద్యార్థులతో ఆమె మాట్లాడారు. విద్యార్థులతో గుణిజాలు చదివిపించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి బోర్డుపై రాయిoచారు. ప్రతీ విద్యార్థి చిన్ననాటి నుంచే బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.
తదనంతరం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి.. బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న పౌష్టికాహారం వివ రాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రం పరిధి లో ఆరుగురు గర్భిణీ స్త్రీలు ముగ్గురు బాలింతలు ఉండగా ఆరుగురు అంగన్వాడి కేంద్రానికి వచ్చి భోజనం చేస్తున్నట్టు అంగన్వాడి టీచర్‌ కలెక్టర్‌కు తెలిపారు. ముగురు బాలింత లు వ్యవసాయ పనుల కారణంగా భోజనాన్ని మధ్యాహ్నం ఇంటికి తీసుకు వెళ్తున్నారన్నారు. గుడ్లు, పౌష్టికా హారం సక్రమంగా అందించి రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఎలాం టి అవకతవకలు జరగకుండా చూసుకోవాలని అంగ న్వాడీ టీచర్‌కు సూచించారు. అనంతరం స్థానిక సీహెచ్‌సీ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు తీరు ను పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్టు తమ ద ష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చ రించా రు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ అశోక చక్రవర్తి, ఎల్‌డ ఎమ్‌ గోపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ మల్లేశం, సీని యర్‌ అసిస్టెంట్‌ నరేష్‌, ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాస్‌, ఏవో శ్రీకాంత్‌, ఎంఈఓ శంకర్‌, ఉపాధ్యాయులు, సిబ్బంది, ఎస్బిఐ బ్యాంక్‌ మేనేజర్‌ జాదవ్‌సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థికాభివృద్ధికి ‘మహిళా శక్తి రుణాలు’ : కలెక్టర్‌
స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా అభివద్ధి చెందడం కోసం ప్రభుత్వం ‘మహిళా శక్తి పథకం’ ద్వారా ప్రత్యేక ఋణాలు ఇవ్వాలని ఆదేశించినట్టు జిల్లా కలెక్టర్‌ క్రాంతి వల్లూరు తెలిపారు. కల్హేర్‌ మండల పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన మహిళా సమా ఖ్య సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా అభివద్ధి చెంద డం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అనేక రకాల ఋణాలను రాయితీపై ఇవ్వనున్నట్టు తెలిపారు. బ్యాంకు లింకేజీ, ఎస్‌చ్‌జి లింకేజీ మండల సమైక్య జిల్లా సమైక్య సీఐఎఫ్‌ నిధుల తో సంఘాలకు ఋణాలు ఇవ్వనట్టు చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ఆయా మండలాలకు కేంద్రా లు, గ్రామాల్లో ఎలాంటి యూనిట్లు ఏర్పాటు చేస్తే మంచి లాభాలు వస్తాయో అలాంటి యూనిట్లను స్వయం సహాj ుక సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వెటర్న రీ విభాగంలో పాడి గేదెల పెంపకం, డైరీ ఫామ్‌ ఏర్పాటు, కోళ్ల ఫారాలు, కస్టం హేరింగ్‌ సెంటర్‌, క్యాంటీన్‌లు, ఇతర ఆహార శుద్ధి యూనిట్లు, పాల కేంద్రాల ఏర్పాటు లాంటి పథకాలు ఉన్నట్లు తెలిపారు. మహిళలు ఏ యూనిట్‌ ఏర్పాటు కోసం ఋణాలు తీసుకుంటున్నారో ఆ యూనిట్లను ఏర్పాటు చేసుకొని సమర్థవంతంగా నిర్వహించి నప్పుడే మహిళలు ఆర్థికంగా అభివద్ధి చెంది కుటుంబానికి ఆసరాగా నిలుస్తారన్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం డిఆర్డిఏ మహిళలకు అవసరమైన సహాయ సహకారాలు అందజే స్తారన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసు కొని వారి వారి గ్రామాలలో మండల కేంద్రాలలో లాభాలు వచ్చే యూనిట్లను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీడీ, డీఆర్‌డీఓ జ్యోతి, అదనపు డీఆర్‌డీఓ జంగారెడ్డి, ఆర్‌డీఓ అశోక్‌ చక్రవర్తి, ఎంపీడీవో శ్రీనివాస్‌, మహిళా సమైక్య అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.