నవతెలంగాణ – రెంజల్
ఇటీవల కార్యదర్శుల బదిలీలు కావడంతో ప్రస్తుతం రెంజల్ మండలంలోని 17 గ్రామగ్రామపంచాయతీ లలో కార్యదర్శుల తమ బాధ్యతలను చేపట్టారు. కందకుర్తి ఇంచార్జ్ గ్రామ కార్యదర్శి గా సతీష్ చంద్ర, పేపర్ మిల్ గ్రామ కార్యదర్శిగా రాజు, నీల గ్రామ కార్యద సిహెచ్ సాయిలు, సాటాపూర్ గ్రామ కార్యదర్శిగా మహబూబ్ అలీ, బోర్గం కార్యదర్శిగా బి. రాణి, తాడు బిలోలి గ్రామ కార్యదర్శిగా రాఘవేందర్ గౌడ్, మౌలాలి తాండ కార్యదర్శిగా రజిని, బాగేపల్లి కార్యదర్శిగా శ్రీకాంత్, కూనేపల్లి కార్యదర్శిగా శివకృష్ణ, దూపల్లి కార్యదర్శిగా సలాం, కళ్యాపూర్ గ్రామ కార్యదర్శిగా నవీన్, వీరన్న గుట్ట గ్రామ కార్యదర్శిగా అర్చన, వీరన్న గుట్ట తాండ గ్రామ కార్యదర్శిగా వెంకటరమణ, కిసాన్ తండా గ్రామ కార్యదర్శిగా సాయిబాబా, రంజాన్ గ్రామ కార్యదర్శిగా రాజేందర్ రావు, అంబేద్కర్ నగర్ గ్రామ కార్యదర్శిగా సునీల్ యాదవ్, దండిగుట్ట గ్రామ కార్యదర్శిగా శిభ, నియామితులు అయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీఓ గా రఫీ హైమద్, సీనియర్ అసిస్టెంట్ గా అన్వర్ రఫిక్, జూనియర్ అసిస్టెంట్ గా సతీష్, ఆఫీస్ సబార్డినింటిగా వీరేందర్ సింగ్ లు కొనసాగుతున్నారని ఎంపీడీవో హెచ్ శ్రీనివాస్ తెలిపారు.