
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ (S.D.F.) క్రింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్లను ప్రకటించారు. అందులో భాగంగా ఈ రోజున నగరంలోని అన్ని ప్రాంతాలలో రోడ్లు బాగు చేయడం, కొత్తగా డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మించడము కొరకు సుమారు 6.25 కోట్లు అలాగే విద్యార్థులకోసం ప్రభుత్వ స్కూల్,కాలేజీలలో అదనపు తరగతులు, మరుగుదోడ్ల నిర్మాణాల కోసం సుమారు 1.30 కోట్లు ఇవ్వడం జరిగింది.అన్ని కలిపి సుమారు 7.55 కోట్ల రూపాయలు ఈ రోజన మంజూరు చేయడము జరిగినది. మిగిలిన వాటిని నగరంలోని మంచినీటి వ్యవస్థ కోసము కేటాయించడము జరిగింది. కాబట్టి ఇట్టి 10 కోట్ల రూపాయలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అలాగే దీని కోసం కృషిచేసిన జిల్లా ఇంఛార్జు మంత్రిగారైన, జూపల్లి కృష్ణారావు కి, ప్రభుత్వ సలహాదారులు,నిజామాబాద్ నగర ఇంఛార్జు మహమ్మద్ అలీ షబ్బీర్ కి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గాడ్ కి నిజామాబాద్ నగర ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున అందరికి ధన్యవాదాలు నగర కాంగ్రేస్ పార్టీ తరుపున తెలియజేశారు.