
వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని బీర్కూర్ తహసిల్దార్ లత మండల పరిధి అధికారులకు సిబ్బందికి ఆదేశించారు. గురువారం తహసిల్దార్ కార్యాలయంలో మండల పరిధి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ లతా మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల పట్ల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, బీర్కూర్ మండల పరిధిలో ఉన్న మంజీరా నది, వివిధ గ్రామాల్లో పొంగిపొర్లుతున్న వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని, వాగుల ప్రవాహ ఉధృతి దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలనీ అన్నారు. ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలకు శెలవు కూడా ప్రకటించామని చెప్పారు. శిథిల భవనాలలో ఎవరు ఉండవద్దని కోరారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించుటకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆమె ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఆహార సరఫరాకు ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. వీరి వెంట ఎంపీడీవో సూపర్ డెంట్ భాను ప్రకాష్ వివిధ గ్రామాల కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.