ఘనంగా శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర..

Sri Ujjain Mahankali Bonala Jatara.నవతెలంగాణ – వేములవాడ
అశాడ మాసం పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర మహోత్సవాలు ఈ నెల 27వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు గురువారం ఆలయ ఛైర్మన్ మహంకాళి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల జాతర మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా మొదటి రోజు శనివారం ఉదయం అమ్మవారికి విశేష అభిషేకములు నిర్వహించనున్నారు.అనంతరం అమ్మవారు శాఖంబరీ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారని పేర్కోన్నారు.రెండవ రోజు ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారని తెలిపారు.సాయంత్రం 6 గంటలకు విజయవాడకు చెందిన ప్రభ బృందం ఆధ్వర్యంలో వైవిద్యమైన వేషధారణతో సాంసృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.గొర్రె పొట్టేళ్ళు,తొట్టెండ్లు,పలహార బండ్లు,పోతరాజుల విన్యాసాలు,నృత్యాలతో డప్పు వాయిద్యాల మధ్య పట్టణ పురవిధుల గుండా అమ్మవారు ఊరేగింపు ఉంటుందని తెలియజేశారు.చివరి రోజు సోమవారం అమ్మవారికి పుష్పాభిషేకం,ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర మహోత్సవాలను ఘనంగా ముగించనున్నట్లు తెలిపారు.మూడు రోజుల పాటు కన్నుల పండువగా నిర్వహించే అమ్మవారి బోనాల జాతర మహోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు స్వీకరించాలని ఆలయ చైర్మన్ మహంకాళి శ్రీనివాస్ గౌడ్ కోరారు.