
నవతెలంగాణ – వేములవాడ రూరల్
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా ప్రజలకు పిలుపునిచ్చారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని జర్నలిస్టుల కాలనీలో వన మహోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా పుట్టినరోజును పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు కాలనీలో జర్నలిస్టులు అంతా కలిసి మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణ తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరం కలిసి దిగ్విజయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఎస్ టీం ఆధ్వర్యంలో లాయక్ పాషా జన్మదిన వేడుకలు
టీయూడబ్ల్యూజే హెచ్ 143 తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా జన్మదిన వేడుకలను వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఎస్ టీం ఆధ్వర్యంలో భక్తులకు, యాచకులకు పండ్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎస్ టీం సభ్యులు మాట్లాడుతూ లాయక్ పాషా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని, ఇలాంటి పుట్టినరోజులను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు తాహెర్ పాషా, మోకాల్ల ఎల్లారెడ్డి,మహేష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండీ రఫీక్ , సయ్యద్ రసూల్, కొత్వాల్ శ్రీనివాస్ ,జితేందర్ రావు, షేక్ రియాజ్, కృష్ణారెడ్డి, జబ్బార్, దేవరాజ్, ఫహద్ పాషా, ముషాయిద్, గంగాధర్, ప్రవీణ్, రజినీకాంత్,హరీష్, శభాష్,నయిమొద్దీన్, శ్యామ్, జునైద్, విష్ణు, ముస్లిం కమిటీ మాజీ అధ్యక్షులు అక్రo పాషా, మాజీ ప్రధాన కార్యదర్శి ఓలీ మహమ్మద్, యూసుఫ్, షాహిద్,అబ్బు, సదానందం లతోపాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.