
పరిశుభ్రత పాటిస్తూ నాణ్యమైన భోజనాన్ని అందించాలని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందువలన పట్టణంలోని మామిడిపల్లి ఏరియాలో కస్తూర్బా పాఠశాల ,మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను గురువారం సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. వంటశాల గదులను పరిశీలించడం జరిగినది భోజనాన్ని వేడివేడిగా పిల్లలకు అందించాలని సూచించడం జరిగినది పిల్లలకి కూడా శుభ్రతను పాటించాలని సూచించడం జరిగింది. మెడికల్ హెల్త్ ఆఫీసర్ మానస తో కమిషనర్ మాట్లాడి పాఠశాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు .ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పూర్ణమౌళి సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ తదితరులు పాల్గొన్నారు.