
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరగగా..రాష్ట్ర బడ్జెట్ వల్ల తెలంగాణ ప్రజలకు న్యాయం చేకూరిందని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సంఘ స్వామి యాదవ్ అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై గురువారం స్వామి యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ నిరాశపరచగా రాష్ట్ర బడ్జెట్ సంతోషం కలిగించిందన్నారు. అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి కలిగించేలా ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ విద్యా మహిళా మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనమనిఆయన అన్నారు. ఈ బడ్జెట్ పేద ప్రజలకు జీవన ప్రమాణాలు పెంచేలా ఉందని ఆయన కొనియాడారు. గూడు లేని నిరుపేదలకు సొంతింటి కల సహకారం చేసేలా ఈ బడ్జెట్ ఉన్నదని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కూరగాయల కొమురయ్య, రాష్ట్ర మహిళా కార్యదర్శి పాత సత్యలక్ష్మి నాయకులు మానుపాటి పరశురాం, వంగపల్లి మల్లేశం,లింగంపల్లి కిరణ్, అంబాటి చంద్రశేఖర్ యాదవ్, చిలుక ప్రభాకర్, జయపాల్ రెడ్డి, ఎల్లా గౌడ్,జాగిరి శ్రీకాంత్, పోతుగంటి వెంకన్న, ఇన్నారం సాగర్, తదితరులు ఉన్నారు.