క్వార్టర్స్‌లో ఆర్చరీ అమ్మాయిలు

Archery girls in quarters– అంకితకు 11వ సీడింగ్‌
పారిస్‌: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత మహిళల ఆర్చరీ జట్టు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన ర్యాంకింగ్‌ రౌండ్‌లో అమ్మాయిలు 1983 పాయింట్లతో నాల్గో స్థానంలో నిలిచి నేరుగా క్వార్టర్స్‌కు చేరింది. దక్షిణ కొరియా, చైనా, మెక్సికో టాప్‌-3లో నిలిచాయి. ఈ నెల 28న క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచులు జరుగుతాయి. మహిళల ర్యాంకింగ్స్‌లో అంకిత 11వ సీడింగ్‌ సాధించింది. భజన్‌ కౌర్‌, దీపిక కుమారి వరుసగా 22, 23వ సీడింగ్‌ సాధించారు.