– బంగ్లాతో భారత్ సెమీస్ నేడు
దంబుల్లా: మహిళల ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మరో టైటిల్‌పై కన్నేసింది. 11 సార్లు చాంపియన్ భారత మహిళల జట్టు నేడు సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన హర్మన్‌ప్రీత్ సేన నేడు సెమీస్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. షెఫాలీ వర్మ, స్మృతీ మంధాన, జెమీమా సహా హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్ భీకర ఫామ్‌లో ఉన్నారు. స్పిన్నర్లు దీప్తి శర్మ, రాధ యాదవ్ దంబుల్లా పిచ్‌పై మ్యాజిక్ చేస్తున్నారు. గతంలో ఆసియా కప్‌లో భారత్‌కు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ నేడు అదే స్ఫూర్తితో బరిలోకి దిగుతుంది. భారత్, బంగ్లా సెమీస్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం.