ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,836 కోట్లు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర బడ్జెట్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,836 కోట్లు కేటాయించారు. 2010-11 నుంచి 2022-23 మధ్యలో దాదాపు వెయ్యి మంది మిల్లర్లు ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లు బకాయి పడినట్టు. గత ఆరు నెలలుగా విజిలెన్స్‌ విభాగం అలాంటి మిల్లర్లపై దాడులు చేసి వారి నుంచి రూ.450 కోట్లు వసూలు చేసినట్టు తెలిపారు. రూ.509 కోట్ల బకాయిలు వసూలు చేసేందుకు 60 మిల్లులపై రికవరీ రెవెన్యూ చట్టాన్ని ప్రయోగించినట్టు బడ్జెట్‌ లో పేర్కొన్నారు. వేగవంతమైన కొత్త వ్యూహాలతో భారత ఆహార సంస్థతో గత మూడు నెలల్లో రూ.3,561.64 కోట్లు సంపాదించి, రూ.1,323.86 కోట్ల బకాయి రుణాన్ని తగ్గించినట్టు తెలిపారు. దీంతో పౌరసరఫరాల శాఖలో సేవలు మెరుగుపడ్డాయని ప్రభుత్వం వెల్లడించింది.