మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్‌ పెంచడం హర్షణీయం : ఆవాజ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్‌లో తగిర విధంగా కేటాయింపులు చేయటం హర్షణీయమని ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకనుగుణంగా కేటాయింపులు జరగలేదని తెలిపారు. కేటాయించిన బడ్జెట్‌ను ఖర్చు చేయాలని కోరారు. గత బడ్జెట్‌ తో పోలిస్తే మైనార్టీ సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు పెంచారని పేర్కొన్నారు. కేటాయించిన బడ్జెట్‌ ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. ఈ ఒరవడికి భిన్నంగా ఉండాలని కోరారు. కేటాయించిన బడ్జెట్‌లో అధిక భాగం విద్య, ఉపాధి రంగాలపై ఖర్చు చేయడం ద్వారా మైనార్టీలు అభివద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఆ పద్ధతులలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లోన్లు, స్కాలర్షిప్‌లు, మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్ల పై కేంద్రీకరించి ఖర్చు చేయాలని కోరారు.