ముంబయి: అమ్మకాల ఒత్తిడితో వరుసగా ఐదో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. మూలధన లాభాలపై బడ్జెట్‌లో పన్ను ప్రతిపాదించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో గురువారం కూడా సూచీలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 109 పాయింట్ల నష్టంతో 80,039కు దిగజారింది. నిఫ్టీ 7.40 పాయింట్ల నష్టంతో 24,406.10 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టి, సన్‌ఫార్మా, కోటక్ మహీంద్రా, బజాజ్ పైనాన్స్ షేర్లు అధికంగా లాభపడగా.. యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, టైటాన్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు అధిక నష్టాలను చవి చూశాయి.