పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ సూచించారు. శుక్రవారం ఫ్రైడే డ్రైడే లో భాగంగా మున్సిపల్ పరిధిలోని సుభాష్ నగర్ కాలనీలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వీధుల్లో తిరుగుతూ డెంగ్యూ వ్యాధి నివారణ పట్ల కళాకారులచేత అవగాహన కల్పిస్తూ..కరపత్రాలను పంపిణీ చేశారు. మన పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చన్నారు.