ఆషాఢమాసం పురస్కరించుకుని భక్తులు బోనాలు సమర్పించేందుకు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన మహాలక్ష్మివాడాలో గల మహాలక్ష్మి ఆలయంలో బోనాలను సమర్పించారు. శుక్రవారం కావడంతో ఉదయం నుండి భక్తులు ఆలయానికి పోటెత్తారు. కాగా మహాలక్ష్మి సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. భక్తులు బోనాలు సమర్పించి తమ కోర్కెలు కోరుకున్నారు. ఇందులో బండారి వంశీ, ప్రవీణ్, నవీన్, ఆకాష్, అభి, ఆశక్క ఉన్నారు.