
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కల్పించే మధ్యాహ్న భోజన వసతి పట్ల చిన్నారి పిల్లలకు భోజన సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేకంగా నిఘ పెడుతున్నారు. శుక్రవారం నాడు మద్నూర్ మండలంలోని హెచ్ కేలూర్ గ్రామంలో గల పాఠశాలను నవ తెలంగాణ సందర్శించగా.. మధ్యాహ్న భోజన వసతి కార్యక్రమంలో పాఠశాల చిన్నారి పిల్లలకు ఆ పాఠశాల ఉపాధ్యాయులు సంజు, రాజు, పకడ్బందీ నిఘా ద్వారా భోజనాలు సక్రమంగా జరగడానికి భోజన సమయంలో చిన్నారి పిల్లలు ఎలాంటి అల్లర్లకు ఎగబడకుండా క్యూ పద్ధతిన భోజనం అందించారు. శుక్రవారం నాటి భోజనంలో పప్పు అన్నం తో పాటు అరటిపండు గ్రుడ్డు పెట్టారు మధ్యాహ్న భోజన సమయంలో ఉపాధ్యాయులు పిల్లల పట్ల ిఘ పెట్టడం విశేషం.