కార్గిల్ అమరవీర సైనికులకు నివాళులర్పించిన న్యాయవాదులు

Lawyers pay tribute to Kargil martyrsనవతెలంగాణ – కంఠేశ్వర్ 
కార్గిల్ విజయ్  దివాస్  సందర్బంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నరంలోని సరస్వతీ నగర్ చౌరస్తా వద్ద కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా శుక్రవారం అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. 1999 జూలై 26  కార్గిల్ వద్ద పాకిస్తాన్ సైన్యాన్ని తరిమికొట్టిన భారత సైన్యం విజయకేతనం ఎగురవేసి నేటితో 25 సంవత్సరాలు గడుస్తుందనిన పాకిస్తాన్ తో దేశ సరిహద్దు కార్గిల్ వద్ద జరిగినటువంటి బీకర యుద్ధంలో ప్రాణాలను ఫణంగా పెట్టి దేశం కోసం విరోచితంగా పోరాడి యుద్ధంలో అనేకమంది అమరవీరులు తమ ప్రాణాలను అర్పించడం జరిగింది. వారి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు మనోధైర్యం ఉండాలని తెలియజేశారు. నేటి యువత భారత వీర సైనికుల త్యాగాల స్ఫూర్తితో దేశ   భక్తి తో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ రాజ్ కుమార్ సుబేదార్ ఉపాధ్యక్షులు, పి.రాజు ప్రధాన కార్యదర్శి, వసంతరావు, న్యాయవాదులు చంద్రశేఖర్ రెడ్డి గోవదన్ అరేటి నారాయణ, శ్రీమన్, ప్రకాష్ ,తిరుపతి, బలరాజ్ నాయక్, మంజీత్ సింగ్ అన్వేష్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.