
పట్టణంలోని పెర్కిట్ కాంతి హై స్కూల్ లో హరితహారం కార్యక్రమం శుక్రవారం సంబురంగా నిర్వహించినారు ..పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో యూకేజీ, ఎల్కేజీ పిల్లలతో కలిసి పాఠశాల లో హరితహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా. పాఠశాల కరస్పాండెంట్ కాంతిగంగా రెడ్డి మాట్లాడుతూ మానవులు ఆధునీకీకరణ బాటలో ప్రయాణిస్తూ అడవులను నరికి వేస్తూ మనకు మనమే ప్రమాదంలోకి వెళుతున్నామని అన్నారు. ఈ మొక్కలు పెంచడం ద్వారా వాతావరణంలోని కాలుష్యాన్ని నివారించవచ్చని మరియు వాతావరణం చల్లబడి సకాలంలో వర్షాలు కురుస్తాయని ఫలితంగా జీవులకు మేలు కలుగుతుందని తెలియజేశారు. ఈ విధంగానే మీ చుట్టుపక్కల కూడా మొక్కలను నాటాలని విద్యార్థులకు సూచించారు. అందుకే మన పూర్వీకులు వృక్షో రక్షతి- రక్షితః వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని మరొక్కసారి హరితహారం సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.