నవతెలంగాణ కంటేశ్వర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చిన్న పిల్లలకు గుండె సంబంధిత వ్యాధులపై ఆరోగ్య శిబిరం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ.. అపోలో హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జిజిహెచ్ నాలుగో అంతస్తులలో డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్(DEIC), రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం (RBSK) లో 0-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు గుండె సంబంధిత వ్యాధుల ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఇందులో పిల్లలకు గుండె సంబంధిత పరీక్షలు ( 2డి-ఏకో ) నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తించినట్లు తెలిపారు. మొత్తం (156) మంది శిబిరానికి హాజరు కాగా అందులో (53) మందిని గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. తుకారాం రాథోడ్, డి.యం&హెచ్.ఓ, డాక్టర్ అశోక్ డి ఐ ఓ, డాక్టర్ అమూల్ గుప్తా, అపోలో హాస్పిటల్ హైదరాబాద్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.