
నవతెలంగాణ కొనరావుపేట : చేనేత కార్మికులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) మండల అధ్యక్షురాలు జవ్వాజి విమల అన్నారు కోనరావుపేట మండలం నిమ్మ పెళ్లి గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మాట్లాడారు చేనేత కార్మికుల చేత ప్లే కార్డ్స్ తో శుక్రవారం చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేత కార్మికులకు ఎలాంటి నిధులు కేటాయించలేదని అన్నారు దిమ్మ పెళ్లిలో చేనేత కార్మికుల పవర్ లోన్ మూత పడిందని అన్నారు గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇచ్చిన విధంగా వీరు కూడా అందజేసి చేనేత కార్మికులకు పని కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు నల్ల తిరుపతి లక్ష్మీరాజ్యం రా పెళ్లి గణేష్ రాములు నరేష్ తదితరులు పాల్గొన్నారు.