పిట్టల సంపత్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి

నవతెలంగాణ శంకరపట్నం
గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసిన ఘటన పూర్తి  వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండల పరిధిలోని మొలంగూర్ గ్రామానికి చెందిన పిట్టల సంపత్( 38 ) శుక్రవారం మొలంగూర్ చౌరస్తా బస్టాండ్ సమీపంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి రాడుతో  దాడి చేయడంతో పిట్టల సంపత్ కుడి చేయి విరిగింది, అది చూసిన స్థానికులు 108 ఫోన్ చేయడంతో సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి, పైలెట్ గోపికృష్ణ, లు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని అంబులెన్స్ లోకి తీసుకొని ప్రథమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది