కార్గిల్ అమరవీరులకి ఘనంగా నివాళి..

కార్గిల్ అమరవీరులకి ఘనంగా నివాళి..– ముఖ్య అతిథిలుగా  అయోధ్య రవీందర్
– వన్ టౌన్ సిఐ ఇంద్ర సేన రెడ్డి
నవతెలంగాణ గోదావరిఖని
గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కార్గిల్ దివస్ కార్గిల్ అమరవీరులకి ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా ప్రధాన చౌరస్తా నుండి శివాజీ నగర్ రీగల్ శుమార్ట్ మీదుగా శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అయోధ్య రవీందర్ సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ పాకిస్థాన్లో చలామణి అవుతున్న ఉగ్ర మూకలు భారతదేశాన్ని దిబ్బ తీయడం కోసం గొర్రెల కాపరులుగా భారతదేశ సరిహద్దుల్లో చొరబడి భారత జవానులను అకారణంగా పొట్టన పెట్టుకోవడం జరిగింది కానీ భారతదేశ యొక్క సమగ్రతను కాపాడి ఎదురుదాడికి దిగి పాకిస్తాన్ సైన్యాన్ని పూర్తిగా నీలమట్టం చేసి భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గెలుపు దిశగా భారత సైనికులు పోరాడిన తీరును ఈరోజుకి యావత్ భారతదేశం మర్చిపోలేకుంది కార్గిల్ యుద్ధంలో 500 పైగా భారత జవానుల మరణం ప్రపంచ దేశాలు కూడా భారత్ జవానులను మరణాన్ని జీర్ణించుకోలేక పాకిస్థాన్ యొక్క కుట్రను ప్రపంచ దేశాల ముందు ఆరోజున అటల్ బిహారీ వాజ్పేయి గారు రక్షణ శాఖ మంత్రి జార్జి పెర్నాండిస్ గారు అనునిత్యం బార్డర్లు భారత సైన్యంతో నిలిచి వారికి ధైర్య సాహసాలను నెలకొల్పుతూ భారతదేశమంతా మీ వెనుక ఉందని తెలియచెప్తూ యుద్యం చేయించడమే గాక పాకిస్థాన్ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టడం జరిగిందని రోజున జవానుల త్యాగాలను ప్రతి సంవత్సరం ఈ రోజున యావత్ భారతదేశం గుర్తు చేసుకుంటుందని వారి ఆశ ఆశయ సాధన కోసం భారతదేశంలో ఉన్న యువత పనిచేస్తుందని భారత దేశంలోని ప్రతి పౌరుడు ఈ దేశం యొక్క సైనికుడిలానే పని చేయాలని ఆదర్శంగా తీసుకొని జాతీయవాద ఆలోచనలతో యువత మంచి ఆలోచనతో ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పైతరి రాజు ముష్క సంపత్ యాదవ్ అడిగొప్పుల రాజు దువాసి తిరుపతి కుంభర అజయ్ మల్లికార్జున్ కార్తీక్ చక్రపాణి రావుల శ్రీనివాస్ ఓదేలు రాజు ఎస్సై సతీష్ నవీన్ భరత్ యశ్వంత్ వెంకటేష్ కుమార్ శ్రీనివాస్ తదితర కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు