– ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ ప్రధాన కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్
నవతెలంగాణ-చేవెళ్ల
సిల్వర్ డెల్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ ప్రధాన కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని స్థానిక సిల్వర్ డే స్కూల్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అరుణ్ కుమార్ మాట్లాడుతూ చేవెళ్ల మండల కేంద్రంలోని సిల్వర్ హై స్కూల్‌కు ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపు లేకపోయినప్పటికీ సిల్వర్ డెల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని పేరెంట్స్‌ను విద్యార్థులను మోసం చేసి అడ్మిషన్లు తీసుకుని వేల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని చెప్పారు. అలాగే పాఠశాలలో మౌలిక వసతులకు సంబంధించి ఎలాంటి సదుపాయాలు లేవని అర్హత పొందిన ఉపాధ్యాయులు లేరని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవన్నారు. విద్యార్థుల సంఖ్య కనుగుణంగా క్రీడా ప్రాంగణం కూడా లేదన్నారు. అయినప్పటికీ ఇంటర్ నేషనల్ స్కూల్ పేరుతో మోసం చేస్తున్నటువంటి యాజ మాన్యంపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంఈఓకి వివరణ కోరగా స్టేట్ సిలబస్ ఉందని స్టేట్ సిలబస్ సంబంధించిన ఈటీఆర్ సబ్మిట్ చేశారని అన్నారు. సిల్వర్ డే స్కూల్ యాజమాన్యం కాసులకు కక్కుర్తి పడి విద్యార్థుల, తల్లిదండ్రుల జీవితాలతో ఆడు కుంటున్న పాఠశాల యాజమాన్యం పై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వ ర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చరణ్, తేజ, మని, గురు చరణ్, తదితరులు పాల్గొన్నారు.