నరేశ్ వికె, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్‌లో నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’. అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 14న ఈ సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. పవిత్ర లోకేష్ ఈ టీజర్‌ని లాంచ్ చేశారు. డైరెక్టర్ సందీప్ రాజ్, వినోద్, ప్రవీణ్ కంద్రేగుల, హీరో తిరువీర్ పాల్గొన్న టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది
నరేష్ వికె మాట్లాడుతూ, ‘కషి ఉంటే మనుషులు ఋషులౌతారు అనే మాటకు నిదర్శనం రామోజీరావు. ఆయన కషితో ఒక లెజెండ్‌గా ఎదిగి, తెలుగు సినిమాని ప్రపంచ సినిమా చరిత్రపుటలో పెట్టి నవ్వుతూ వెళ్ళిపోయారు. నా బండికి నాలుగు చక్రాలు. విజయ నిర్మల, కష్ణ, జంధ్యాల, రామోజీరావు. ఉషాకిరణ్ మూవీస్ ‘శ్రీవారికి ప్రేమలేఖ’తో హీరోగా స్టార్ట్ అవ్వడం నా అదష్టం. ఆ సినిమాతోనే బాపినీడుతో పరిచయం. ఈ సినిమాకి ఆయన బ్యాక్‌బోన్. ఎక్కడా లోటు లేకుండా అద్భుతంగా సినిమాని నిర్మించారు. అనురాగ్ చాలా ప్రతిభ ఉన్న దర్శకుడు. స్క్రిప్ట్ విన్నాక.. జంధ్యాల, త్రివిక్రమ్, వివేక్ ఆత్రేయ అలాంటి వినూత్నమైన ఒరవడి తనలో కనిపించింది. ఇది విజువల్ ట్రీట్. శతమానం భవతి సినిమా ఎన్‌ఆర్‌ఐ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం కూడా అలానే అలరిస్తుంది. చాలా అద్భుతమైన ఎమోషన్ ఉన్న కథ ఇది. ఇది నాకు గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్. గోల్డెన్ ఫిల్మ్’ అని తెలిపారు.
‘ఈ సినిమా కోసం చాలా ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాతో ఈటీవీ విన్ ఇంకా గట్టిగా ఫ్యామిలీస్‌లోకి వెళుతుందని కోరుకుంటున్నాను’ అని డైరెక్టర్ సందీప్ రాజ్ చెప్పారు.
ఈటీవీ విన్ – కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ,’ఈ సినిమా ఫాదర్స్ అందరికీ అంకితం చేస్తున్నాం,. అనురాగ్ పెద్ద డైరెక్టర్ అవుతాడు. చాలా అద్భుతంగా తీశాడు. నరేష్ ఈ ప్రాజెక్ట్ డైమెన్షన్స్‌ని మార్చారు. అందరూ ఎంజారు చేసేలా ఈ సినిమా ఉంటుంది’ అని తెలిపారు.
దర్శకుడు అనురాగ్ పలుట్ల మాట్లాడుతూ,’ఓ మంచి సినిమాని ప్రేక్షకులకు అందించబోతున్నాం. ఈటీవీ విన్‌లో మా చిత్రాన్ని అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.