– జీపీల్లో ఫ్రైడే.. డ్రైడే నిర్వహణ
నవతెలంగాణ-జుక్కల్
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు సిబ్బందికి సూచించారు. జుక్కల్ మండలంలోని హంగర్గ గ్రామ పంచాయతీ గ్రామంలో జీపీ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే నిర్వహించామని జీపీ కార్యదర్శి ఆశోక్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా హెల్త్ అధికారులు పలు సూచనలు చేశారు. గ్రామాలలను సందర్శించి ఫీవర్‌తో బాద పడుతున్న వారిని సర్వే చేసారు. అధేవిధంగా లార్వల్ సర్వే, యాంటి లార్వల్ స్ప్రే వర్క్ మురికాలువల వద్ద, ఐఆర్‌ఎస్ స్పే వర్క్, ఆరోగ్యం పైన గ్రామస్తులకు అవగాహన హెల్త్ వర్కర్లు కల్పించారు. గ్రామాలలో ముఖ్యంగా పారీశుధ్య పనులు నిత్యం చేయాలని పేర్కొన్నారు.
భిక్కనూర్ : మండలంలోని బస్వాపూర్, మల్లుపల్లి, ఇసన్నపల్లి గ్రామాలలో ఎంపీఓ రాజ్ కిరణ్ రెడ్డి ఫ్రైడే డ్రైడే సందర్భంగా గ్రామ ప్రజలకు పాత డబ్బాలు, కుండీలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాలలో పర్యటించి స్వయంగా ఎంపిఓ పరిసరాలలో నిలువ ఉన్న నీటిని పారబోశారు. దోమలు వ్యాపించకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల కార్యదర్శులు, ఆశ వర్కర్లు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్ : మండలములోని భూంపల్లి, పద్మాజీవాడి, మోడేగాం గ్రామలను జిల్లా పరిషత్ సీఈఓ చందర్ నాయక్(ఇంచార్జ్) జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి, మండల ప్రత్యేక అధికారి రమేష్ బాబు పంచాయతీలను పర్యవేక్షించి ఫ్రైడే డ్రైడే, శానిటేషన్, నర్సరీ, ప్లాంటేషన్‌లలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఎం.సురేందర్ రెడ్డి, ఏపీవో మధు, పంచాయతీ కార్యదర్శులు, పాల్గొన్నారు.