వరద బాధితులకు పోలీసుల సాయం

వరద బాధితులకు పోలీసుల సాయంనవతెలంగాణ-బెజ్జూర్‌
మండలంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత బ్యాక్‌ వాటర్‌ వల్ల ముంపునకు గురైన తలాయి, తిక్కపెల్లి, భీమారం గ్రామస్తులు బయటికి వెళ్లలేని పరిస్థితులులో ఉన్నారు. దీంతో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్సై బి.విక్రమ్‌ మూడు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు శుక్రవారం పంపిణీ చేశారు. వరద బాధితులకు సాయం చేసి బెజ్జూరు పోలీసులు మానవత్వం చాటుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ మోహన్‌ నాయక్‌, తలాయి మాజీ ఎంపీటీసీ లంగారి శ్రీనివాస్‌, కృష్ణపెల్లి మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌, హెడ్‌ కానిస్టేబుళ్లుశ్రీమంత్‌, వెంకటేష్‌, నాయకులు దందర ఇస్తారి, హోంగార్డులు మహేష్‌, శంకర్‌, లక్ష్మణ్‌, గ్రామస్తులున్నారు.