స్మితా సబర్వాల్‌ వ్యాఖ్యలు సమంజసం కాదు

– ప్రొఫెసర్‌ కోదండరాం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వికలాంగులు కొన్ని రకాల ఉద్యోగాలకు పనికి రారని ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైకల్యం పేరుతో హక్కులను హరించడం సరి కాదని హితవు పలికారు. స్మితా సబర్వాల్‌ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోగా సమర్థించుకోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు.