ముదిరాజులను బీసీ డీ నుండి బిసి ఏ గా మార్చాలని డిమాండ్

Demand to change Mudiraju from BCD to BCAనవతెలంగాణ – హలియా
అనుముల తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు యలకని వెంకటేశ్వర్లు ముదిరాజ్, హాలియా టౌన్ అధ్యక్షులు పుట్ట దుర్గారావు ముదిరాజ్ ఆధ్వర్యంలో అనుముల తాసిల్దార్ జయశ్రీ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముదిరాజులను బీసీ డీ నుండి బిసి ఏగా మార్చాలని ప్రధాన డిమాండ్ చేశారు. అనుముల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజులను బిసి డి నుండి బిసి ఏగా మార్చాలని ప్రధాన డిమాండ్తో తాసిల్దార్ వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ ముదిరాజు గారి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా అధ్యక్షులు వెలుగు రవి ముదిరాజ్ సూచన మేరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ముదిరాజుల ను బిసి డి నుండి బీసీ ఏ గా మార్చి ముదిరాజులను అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. ముదిరాజులకు మత్స్య పారిశ్రామిక సొసైటీ ఏర్పాటు చేసి రూ.1000 కోట్లను మంజూరు చేయాలని అదేవిధంగా ముదిరాజులకు 75 శాతం సబ్సిడీతో కూడినటువంటి నిధులను ప్రతి సభ్యునికి ప్రతి సభ్యునికి అందజేయాలని, అలాగే ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ కార్పొరేషన్ లో ముదిరాజుల కోసం రూ.1000 కోట్లు రూపాయలు మంజూరు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమం లో పుట్ట శ్రీను ముదిరాజ్, పెరమళ్ళ భద్రయ్య ముదిరాజ్, మేకల బిక్షం ముదిరాజ్, జినకల వెంకటయ్య ముదిరాజ్, చంద్రవంక రమేష్ ముదిరాజ్, నిఖిల్ కుమార్, సైదారావు , యలకని అంజిబాబు చంద్రవంక ధన మల్లయ్య వంశీ సాయి వినోద్ కుమార్ తదితర ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.