నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బంగారు పల్లి గ్రామములోని ఎంపిపీఎస్ పాఠశాలను, అభివృద్ది పనులను శనివారం నాడు ఎంపీవో రాము సందర్శించి పనులను పరీశీలించారు. మెుదటగా గ్రామాలలోని ప్రభూత్వ పాఠశాలలోని నిర్మించిని ఏఏపీ పనులను పకీశీలించారు. విద్యార్థుల హజరు పట్టికను చూడటం జర్గింది. సమయ పాలన పాటీంచాలని హెచ్ఎం రాజేందర్ అప్పాను ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రం ను సందర్శించి పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహరం వివరాలను , రికార్డులను పరీశీలించి, నిత్త్యం పిల్లలకు, గర్భిణిలకు, బాలీంతలకు పాలు, గుడ్లు, బాలమృతం అందించాలని టీచర్ మంగళ బాయి ని ఆదేశించారు. గ్రామములో శానీటేషన్ పనులను దగ్గరుండి శుభ్రం చేయించి నారు. పల్లె ప్రకృతి వనం సందర్శించి పెర్గిన చెట్లు పెద్దదైనవి చూసి సంతోషం వ్యక్తం పరిచారు.