గ్రామాల్లో పరశుభ్రతపై చర్యలు చేపట్టాలి

Actions should be taken on cleanliness in villages– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు 
నవతెలంగాణ-  నెల్లికుదురు 
మండలంలోని వివిధ గ్రామాల్లో చెత్తా చెదారం లేకుండా బ్లీచింగ్ చల్లి పరిశుభ్రతపై చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు అన్నాడు. మండలంలోని మునిగల వీడు గ్రామంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ సమావేశం ఎండి యాకుబ్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొద్దిపాటి వర్షాలు పడుతున్న తరుణంలో గ్రామాలలో విష జ్వరాలు వచ్చె ప్రమాదం ఉందని వైద్య సదుపాయాలు కల్పించాలని వాటి నివారణకు గ్రామాలలో శానిటేషన్ బ్లీచింగ్ చేయించి చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని సత్వరమే అధికారులు చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. గ్రామాలలో పిచ్చి కుక్కలు ప్రజలపై దాడులు చేస్తూ గాయాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు రుణమాఫీ సక్రమంగా వచ్చే విధంగా అధికారులు ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా కొత్తవారికి కూడా బ్యాంకు రుణాలు అందజేయాలని డిమాండ్ చేశారు. 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ శాఖ కార్యదర్శి ఇసంపెల్లి సైదులు బత్ సత్యనారాయణ మచ్చ వెంకన్న బిక్షపతి మంగ్య తదితరులు పాల్గొన్నారు.