
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2024-25 వార్షిక బడ్జెట్లో చేనేత రంగాన్ని,చేనేత కార్మికుల ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోలేదని చేనేత సంఘం జిల్లా నాయకులు, బి సి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వంగరి బ్రహ్మం అన్నారు.శనివారం తిరుమలగిరి మండల చేనేత సంఘం ముఖ్య నాయకుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. మనిషి కి కూడు పెట్టిన రైతన్న తరువాత అదే మనిషికి గుడ్డ ను అందించి వారి మాన ప్రాణాలను కాపాడి సమాజం లో సగౌరవంగా జీవించేలా తిరిగేలా చేస్తున్న చేనేత నేతన్న ను ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీస గుర్తింపు కాదు కదా వారి ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం ఎంతో బాధాకరం శోచనీయం అన్నారు. ప్రజా ప్రభుత్వం లో చేనేత కు గతం కంటే మంచి ప్రాధాన్యత దక్కుతుతుందని ఆశించాము. కానీ పెనం మీద నుండి పొయ్యి లోకి చేనేత రంగాన్ని, నేత కార్మికుల ను తోస్తుంది అనుకోలేదన్నారు. నేత కార్మికుడు మరియు ఆ కుటుంబం అంతా రోజంతా కష్టపడితే అతని కనీస కూలీ రూ.400 రూపాయలు మించదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అందుతుంటే దానిని అందుకోలేక నేతన్న చతికిలపడి పోయి తను అర్థాకలి తో ఉండటమే కాకుండా కుటుంబాన్ని కూడా పస్తులు ఉంచుతూ జీవితాన్ని వెల్లదీస్తుందాన్నారు.
ఈ పరిస్థితులలో చేనేత రంగానికి, కార్మికులకు అండగా నిలబడి వారిని అదుకోవాల్సింది పోయి ఉన్న సంక్షేమ పథకాలను వారికి దూరం చేయడం అనేది వారి జీవితాలతో చెలగాటం అడుకోవటమే అవుతుందన్నారు.ఇప్పటికే రాష్టం లో అక్కడక్కడ నేత కార్మికులు సరి అయిన వేతనం లభించక కుంటుంబాలను సాధలేక ఆత్మహత్య లు చేసుకుంటున్నారు.ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ కేటాయింపులు చూసి నేతన్నలు ఆందోళనతో దిక్కులేని వారవుతారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నేతన్నల బాధలు వారు పడుతున్నా కష్టాలను చూసి ఉపాధి కల్పనే కాకుండా నూలు సబ్సిడీ పథకం,నేతన్నకు చేయూత త్రీఫ్ట్ పథకం,చేనేత భీమా పథకం, మగ్గాల ఆధునీకరణ పథకాల అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరు కుంటున్నమని, లేకపోతే భవిష్యత్తులో చేనేత రంగం అనేదే ప్రశ్నార్థకం అవుతుందని,ఎందుకంటే చేసిన పనికి సరైన గిట్టుబాటు కాక,ప్రభుత్వం అందించే తోడ్పాటు, సంక్షేమ పథకాలు లేక వారు ఈ చేనేత వృత్తి కి మనస్సు చంపుకుని దూరం అయ్యే ప్రమాదం ఉందని .అప్పుడు మనం ఎంతో ప్రాచీనమైన ఈ రంగం, దేశంలో వ్యవసాయం తరువాత రెండో అతిపెద్ద ఆధారిత రంగం గా చెప్పుకుంటున్న చేనేత కనుమరుగై పోవడం ఖాయం.అప్పుడు నేతన్న ల పాపం ఉసురు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పక తగులుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి సరి అయిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామన్నారు. లేకపోతే జాతీయ చేనేత దినోత్సవం అయిన ఆగస్టు 7 దాకా చూసి రాష్ట్రం లో ఉన్న నేత కార్మికులందరం వివిధ సంఘాలు,సామాజిక సంఘాలు ,కలిసొచ్చే అందరి తో మా చేనేత రంగాన్ని కాపాడుకోవటం కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశం లో సంఘ నాయకులు వంగరీ సోమ కృష్ణ,మద్దూరి ఉమేష్,రాపోలు కొండయ్య,అక్కల ఉప్పలయ, వంగరీ రమేష్, కోక్కుల సోమనర్సయ్య,మద్దూరి శేఖర్, చిలుకమారి జయరాములు, వంగరీ కోటయ్య,కోట రాములు, వెంగలి పాండయ్య,మంచే అంబాదాస్,కోట సిద్ది రాములు, వెంగలి మధు, వంగరీ శ్రీను,కోమటి శేఖర్,తదితరులు పాల్గొన్నారు.