అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీశాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ లపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఉద్యమిద్దాం పోస్టర్లను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో శనివారం ఆవిష్కరించారు .ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బచ్చనబోయిన శివ మాట్లాడుతూ రాష్ట్రంలో యూనివర్సిటీల పరిస్థితి దయనీయంగా ఉందని, కనీసం మౌలిక వసతులు లేక, విద్యార్థులకు నాణ్యమైన విద్య అంధక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూనివర్సిటీలలో రెగ్యులర్ విసిలు లేక విద్యార్థుల సమస్యలను పట్టించుకునే వారు లేరని వాపోయారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యూనివర్సిటీలకు, తెలంగాణ యూనివర్సిటీ కూడా తక్కువ నిధులు కేటాయించడాన్ని ఈ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని విస్మరించి ,యూనివర్సిటీలను అంధకారంలోకి తీసుకుపోవాలని, పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే కుట్ర చేస్తుందని వివరించారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి విద్యారంగాన్ని బాగు చేయాలని యూనివర్సిటీలకు అధిక బడ్జెట్ కేటాయించి విద్యార్థులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. డిమాండ్స్ అన్ని యూనివర్సిటీలకు వెంటనే రెగ్యులర్ విసిలను నియమించాలని, యూనివర్సిటీ ఖాళీగా ఉన్న టీచింగ్, నాట్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, యూనివర్సిటీ లలో నూతన బాలికల హాస్టల్ నిర్మించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులకు లైబ్రరీలో అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలు, ప్లేస్మెంట్ అవకాశం కల్పించాలని, తెలంగాణలో 2000 నుండి 3000 మంది విద్యార్థులు పట్టే ఆడిటోరియం నిర్మించాలని సూచించారు.విద్యార్థులకు 24 గంటల వైద్య సదుపాయం, నూతన అంబులెన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షుడు సాయికుమార్,సెక్రెటరీ అమృత్చారి ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరాజు ఉపాధ్యక్షులు,అనిల్,నాయకులు హరినాథ్ సమీర్ మోహన్ లెనిన్ సురేష్ గజేందర్ అక్షయ్ సాయి తదితరులు పాల్గొన్నారు.