– 8 బర్రెలను కాటేసిన కుక్క
– గ్రామ నాయకుడు నల్లని పాపారావు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని మునిగిలవీడు గ్రామంలో ఒక పిచ్చికుక్క గ్రామంలో కి వచ్చి ఇద్దరినీ కరిచి 8 గేదెలను కరిచినట్లు ఆ గ్రామ నాయకుడు నల్లని పాపారావు తెలిపాడు. శనివారం కరిచిన వ్యక్తులను మరియు కుక్క కరిచిన గేదెలకు దగ్గర ఉండి వ్యాక్సిన్ ఇప్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఒక పిచ్చికుక్క వచ్చి కిరాణం సరుకులు తెచ్చుకుంటున్నా వెంకటరమణసయ్య ను మరియు ఇంటి వద్ద కూర్చున్న కాంతమును కుక్క స్వైరా విహారం చేస్తూ వారిని కరిచి వేరే కొంత మంది కరవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో గ్రామానికి చెందిన యువకులు కొంతమంది దాన్ని తరిమే ప్రయత్నం చేశారని అన్నారు. కానీ అది ఉరుకుతూ గ్రామానికి చెందిన 8 మంది గేదెలను దూడలను కరిచి ఇబ్బందికి గురి చేసింది అని అన్నారు విషయం తెలుసుకున్న గ్రామ నాయకుడు పాపారావు అక్కడ చేరుకొని ఒక కరిచిన వారిని కాపాడేందుకు వన్ జీరో ఎయిట్ వాహనానికి ఫోన్ చేసి ప్రభుత్వ దావకానకు పంపించి వ్యాక్సినించే కార్యక్రమాన్ని తీసుకున్నామని అన్నారు. అంతేకాకుండా గేదెల కూడా సమస్య వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లి వ్యాక్సినించే కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. కానీ గ్రామానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కొంతమంది నాయకులు అట్టి కుక్కను తరిమి గ్రామంలోని కొంతమంది ప్రాణాలను కాపాడారని అన్నారు. గ్రామంలో కుక్కల నివారించేందుకు ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు.