పేద విద్యార్థులకు అండగా బి.ఎన్.రావు ట్రస్ట్ సేవలు..

BN Rao Trust services for poor students..– రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 మెయిన్స్ లో తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు అధిక సంఖ్యలో విజయం సాధించాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి ఆకాంక్షించారు. కరీంనగర్ కు చెందిన  డాక్టర్ బి.ఎన్ రావు మెమోరియల్ ట్రస్ట్  స్థాపకులు డాక్టర్ బి.నరేందర్ రావు  వృత్తిరీత్యా ఎముకలు కీళ్ల వైద్య నిపుణులు ఐనప్పటికీ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పేద విద్యార్థులకు  అనేకమందికి ఆర్థికంగా సేవలందించడం అభినందనీయమని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.శనివారం  తెలంగాణ యూనివర్సిటీ లైబ్రరీలో  గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాసై మెయిన్స్ సిద్ధమవుతున్న విద్యార్థులకు  స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో డాక్టర్ బి.నరేంద్రరావు పాల్గొని జనరల్ స్టడీస్,  పోటీపరీక్షలకు ఉపయోగపడే విలువైన  పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా  డాక్టర్ నరేంద్ర రావు మాట్లాడుతూ  పేదరికం నుండి విముక్తి కావడానికి చదువు మహా ఆయుధంగా ఉపయోగపడుతుందని  చదువుతూనే పేదరికాన్ని జయించాలని పిలుపునిచ్చారు. అన్ని దానాల కంటే విద్యా దానం మెరుగైందని,ఇదే శాశ్వతంగా  నిలబడుతుందని మా ట్రస్టు  విద్యకు దూరమవుతున్న పేదలను ఆదుకుంటుందని తెలియజేశారు. పేద విద్యార్థులు ఎవరున్నా  మా ట్రస్టు  భవిష్యత్తులో ఆదుకుంటుం దని భరోసా ఇచ్చారు.విద్యార్థులు మా సేవలు ఉపయోగించుకొని భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడాలన్నారు.ఈ కార్యక్రమములో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ ఆరతి,  ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా చంద్రశేఖర్, లైబ్రేరియన్ సత్యనారాయణ తో పాటు కాంపిటీటివ్ సెల్ డైరెక్టర్ డాక్టర్ రమణాచారి పాల్గొన్నారు.