మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్ర పాఠశాల లో శనివారం రోజున బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల ప్రిన్సిపాల్ ఆసంవార్ సాయినాథ్ జ్యోతి ప్రజ్వలన వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ప్లే స్కూల్ ఇంచార్జ్ హేమ లత మాట్లాడారు. మన తెలంగాణ లో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి బోనాల పండుగ అని ఇది మన రాష్ట్ర పండుగ అని పేర్కొన్నారు. మన తెలుగు నెలలో లో వచ్చే ఆషాడ మాసంలో బోనాల పండుగను రాష్ట్రం అంతటా చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలియజేశారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ అసంవార్ సాయినాథ్ మాట్లాడారు .బోనాలు ఆషాఢ మాసంలో అమ్మవారికి సమర్పించి రైతులు తమ పాడి పంటలను క్రిమి కీటకాల బారినుండి కాపాడి అలాగే తమ గ్రామాన్ని వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల నుండి కాపాడమని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈసందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం కరస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతన్న యదవ్, బీమ్రావ్ దేశాయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.