రోడ్డు ఎప్పుడు బాగు చేస్తారో…..?

రోడ్డు ఎప్పుడు బాగు చేస్తారో.....?నవతెలంగాణ-జఫర్‌గడ్‌
వర్షాలు కురుస్తుండడంతో రహదారిపై అడుగడుగునా గుం తలు పడడంతో బురదమ యం గా మారడంతో కాలనీవాసులు ప్ర మాదాల బారిన పడుతున్నారు. మండల కేంద్రంలోని అంగడి దగ్గ ర ఉన్న కాలనీవాసుల ఇండ్లకు  రహదారి బురద మయంగా మారి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ రోడ్డుగుండా నిత్యం కాలనీవాసులు నడుస్తూ ఉంటారు. రోడ్డు మాత్రం అధ్వా న్నంగా ఉండి ప్రయాణం నరకంగామారింది. రోడ్డు వేయాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్ల కాలనీ రోడ్డు దుస్థితి అధ్వానంగా మారింది. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారినా రోడ్డు పరిస్థితి మారలేదని కా లనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు వెళ్లాలన్నా కూడా జారిపడి ప్రమాదాల గురి పరిస్థితి ఉందన్నారు. కాలనీ కి రోడ్డు వేయాలని గ్రామపంచా యతీ వేడుకుంటున్నారు. గ్రామపంచాయతీ అధికారులు కూడా కాలనీ రోడ్డును పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు అధికారులు కూడా ఈ రోడ్డుపై పట్టించుకోవడంలేదని కాలనీవాస ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు.
ఈ రోడ్డు స్థితిగతులు అవస్థలు గమనిస్తూ కూడా అధికారులు మరమ్మతు చేయడం లేదని ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి. ఈ తిప్పలు తప్పడం లేదని వాపోతున్నారు. అధికారులు, గ్రామపంచాయతీ స్పెషల్‌ ఆఫీసర్‌, పంచాయతీ అధికారులు పట్టించుకోని రోడ్డు బాగు చేసి ప్రజలను సమస్యలు తీర్చాలని, రోడ్డు త్వరగా బాగు చేసి కాలనీవాసులకు న్యాయం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.
రోడ్డు ఇలా అంటే నడిచేది ఎలా ? : సముద్రాల నరసయ్య
అంగడి దారి నుండి కాలనీకి వెళ్లేదారి రోడ్డు పూర్తిగా గుంతలుగా మారి నడిచే పరిస్థితి లేదు. రోడ్డుపై ప్ర యాణం చేయడం, వాహనాలకు గగనంగా మారింది అ న్నారు. చాలా కాలం నుండి కాలనీకి రోడ్డు వేయక, మర మ్మతులు కూడా చేపట్టకపోవడంతో గుంతల మైనంగా మారింది. దీంతో కాలనీవాసులు నడుచుకుంటూ వెళ్లాల న్నా, వాహనాలు వెళ్లాలన్న ప్రమాదకరంగా ఉందన్నారు. గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోని రోడ్డుపై మరమ్మతు చేయాలని వేడుకుంటున్నాను.
రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలి : తిప్పర బోయిన కృష్ణ
ముసురు పడిందంటే కాలనీ రోడ్లు బురదమ యంగా గుంతలతో అధ్వానంగా ఉంది. వెంటనే గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు చొరవ తీసుకొని మా కాలానికి రోడ్డు వేయాలని కోరారు. వెంటనే తాత్కాలిక మరమతులను చేపట్టాలని గ్రామపంచాయతీ వేడుకుంటున్నా.